|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 02:50 PM
ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు సుమన్ తనపై చేతబడి జరిగినట్లు తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఎవరో తనపై చేతబడి చేయించారని దీనికి కేరళలోని చోటనికరే అనే ప్రాంతంలో విరుగుడు పూజ చేయించుకున్నానని తెలిపారు. ఎవరు చేయించారో తెలియదని అయితే సినిమా, వ్యాపార రంగాల్లో ఇలాంటివి సర్వసాధారణమని పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేరని వాపోయారు.
Latest News