|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 05:38 PM
సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోనా దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన 'తెలుసు కదా' చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న గొప్పగా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలో వరల్డ్ వైడ్ గా 16.3 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరియు రాషి ఖన్నా మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో వైవా హర్ష ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చార్ట్-టాపింగ్ మ్యూజిక్‌కి పేరుగాంచిన థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది.
Latest News