|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 03:50 PM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వార్ 2’. ఈ మూవీ ట్రైలర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌కు ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దీంతో ఈ ట్రైలర్‌ను మేకర్స్ వచ్చే వారం విడుదల చేయనున్నట్లు సమాచారం.అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఇది యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రం. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, తారక్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Latest News