|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:30 PM
నాగార్జున, ధనుష్, రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కి గతవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం కుబేరా. పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్‌పర్ట్ చేయలేదంటూ పలువురు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేశారు.మరి కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ సినిమాను సునిశితంగా విమర్శిస్తున్నారు. సినిమాలో మిస్సయిన లాజిక్స్ గురించి ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ చిత్రం ప్రస్తుత బీజేపీ పాలనను టార్గెట్ చేసినట్లు ఉందని కూడా అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కుబేరాకి 13 ప్రశ్నలు అంటూ తన సందేహాలను వ్యక్తం చేయగా... ఇప్పుడవి సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు అధికులు నిజమే కదా అని అంటుంటే.. మరికొందరు సినిమాను సినిమాలానే చూడాలంటూ హితవు పలుకుతున్నారు.
Latest News