|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:30 PM
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ది పేరుకు తగ్గట్టే బంగారం లాంటి హృదయం. ఫిల్మ్ మేకింగ్ నుండి నటిగా మారిన సోనమ్ కపూర్ కు బాలీవుడ్ బెస్ట్ స్టైలిస్ట్ గానూ మంచి పేరుంది. యుక్త వయసులో బోలెడంత బరువున్న సోనమ్ కపూర్ ఎప్పుడైతే కెమెరాముందుకు నటిగా రావాలని అనుకుందో అప్పుడు పట్టుదలతో సైజ్ జీరోకి మారిపోయింది. కెరీర్ ప్రారంభంలో సంజయ్ లీలా బన్సాలీ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసింది. ఆ తర్వాత అతని దర్శకత్వంలోనే 'సావరియా'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'నీర్జా' బయోపిక్ కు గానూ జాతీయ స్థాయిలో నటిగా స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది సోనమ్ కపూర్. తాజాగా సోనమ్ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను ప్లే చేసింది. తన పొడవైన జుత్తులోంచి 12 అంగుళాలను డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. సహజంగా స్వచ్ఛంద సంస్థలు ఇలా జుత్తును సేకరించి, క్యాన్సర్ పేషెంట్స్ కోసం విగ్గులను తయారు చేస్తుంటారు. సోనమ్ కపూర్ కూడా ఛారిటీ కోసం తన హెయిర్ ను డొనేట్ చేస్తున్నట్టు చెప్పడం ఆమె కూడా ఇదే కార్యం కోసం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అనిల్ కపూర్ కూతురుగా తనకూ ఒత్తైన పొడుగాటి జుత్తు ఉందని, అందులో కొంత భాగాన్ని ఇప్పుడు డొనేట్ చేస్తున్నానని చెప్పింది. ఆమె మంచి మనసుకు అభిమానులు, తోటి సినీ జనం అభినందనలు తెలియచేస్తున్నారు.
Latest News