|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:51 PM
అమెరికాకు చెందిన అలెక్స్ వాంగ్ అనే వ్యక్తి, ఓ ప్రముఖ హిందీ సినిమా పాటకు చేసిన క్లాసికల్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అద్భుతమైన నృత్య ప్రతిభ, మనోహరమైన హావభావాలు నెటిజన్ల మనసులను గెలుచుకున్నాయి. ఈ ప్రదర్శన ద్వారా భారతీయ సంప్రదాయ నృత్యరీతుల పట్ల తనకు ఉన్న ఆసక్తిని కూడా ఆయన పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే... అలెక్స్ వాంగ్ అనే అమెరికన్, బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'సాథియా'లోని 'చల్కా చల్కా రే' పాటకు అద్భుతంగా నృత్యం చేశారు. కేవలం డ్యాన్స్ చేయడమే కాకుండా తన ప్రదర్శనలో భరతనాట్యంలోని కొన్ని అంశాలను కూడా జోడించి, ముఖంలో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ అలరించారు. ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోకు అలెక్స్ వాంగ్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు. "నేను భారతీయ నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటికే క్లాసుల గురించి వెతకడం మొదలుపెట్టాను. ఇది నా మొదటి భరతనాట్య ఫ్యూజన్ క్లాస్ అనుభవం. భారతీయ నృత్యం నేర్చుకోవడం ఒక కొత్త భాష నేర్చుకున్నట్లే ఉంది. చేతులు, కాళ్ల కదలికలను సమన్వయం చేసుకుంటూ డ్యాన్స్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.
Latest News