|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 01:08 PM
తన బ్రేకప్ స్టోరీ గురించి నటి అనన్య నాగళ్ల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం ఎంతో బాధపడ్డా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి బ్రేకప్ జరిగింది. రెండేళ్ల పాటు ఆ బాధను అనుభవించాను. అయితే.. చేసే పనిపై ఆ ప్రభావాన్ని పడనీయలేదు. రాత్రంతా ఏడ్చేసి ఉదయాన్నే జిమ్కు వెళ్లిపోయేదాన్ని. కారవాన్‌లో ఏడ్చేసి.. ఆ తర్వాత ఏం జరగనట్లు బయటకు వచ్చేదాన్ని’ అని అనన్య తెలిపారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల కుటుంబం వీరి తండ్రి వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడింది. బీటెక్ పూర్తి చేసిన అనన్య చదువు తర్వాత ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. తర్వాత నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలుత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన అదృష్టం పరీక్షించుకున్న అనన్యకు షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌కు గాను సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యింది. ఈ దశలో చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది అనన్య.
Latest News