|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 10:50 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాము 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు అందుకున్నట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ అవార్డు ప్రపంచ యోగా దినోత్సవం రోజున దక్కడం గర్వకారణమని అన్నారు. యోగాతో ప్రజలను ఆకర్షించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని తెలిపారు. ఫిట్‌నెస్ సాధించడానికి ఖరీదైన జిమ్‌లు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు."ఎలాంటి ఫ్యాన్సీ జిమ్ములు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్‌గా మారొచ్చు" అని రకుల్ వ్యాఖ్యానించారు. యోగా అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా సులభంగా ఆచరించవచ్చని తెలిపారు. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆమె సూచించారు.
Latest News