|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 02:42 PM
విశ్వం: శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'విశ్వం' చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మోస్తరు సమీక్షలను అందుకుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జూన్ 22న ఉదయం 8 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్ గోపీచంద్ కి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్, VTV గణేష్ మరియు ఇతర నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. TG విశ్వ ప్రసాద్ మరియు వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
టిల్లు స్క్వేర్: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'టిల్లు స్క్వేర్' డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాన్స్, క్రైమ్ మరియు కామెడీ చిత్రం జూన్ 22న మధ్యాహ్నం 2:30 గంటలకి స్టార్ మా ఛానల్ లో ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో నేహా శెట్టి మరియు ప్రియాంక జవాల్కర్ అతిధి పాత్రలు పోషించారు. ప్రిన్స్ సెసిల్, నేహా శెట్టి, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించింది. అచ్చు రాజమణి, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు.
పుష్ప 2: సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క రీలోడెడ్ వెర్షన్ ని జూన్ 22న సాయంతరం 4:30 గంటలకి స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాలో రష్మికా మాండన్న మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ పాన్-ఇండియన్ సినిమాలో ఫహద్ ఫాసిల్ క్రూరమైన విలన్ పాత్రను పోషిస్తాడు, సునీల్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, జగదీష్, బ్రహ్మాజీ మరియు రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించింది. థమన్, సామ్ సిఎస్ మరియు ఇతరుల అదనపు సహకారాలతో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
Latest News