|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:28 PM
తమిళం నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో 'ఒరునోడి' ఒకటి. మణివర్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తమన్ కుమార్ .. భాస్కర్ .. వేల రామమూర్తి .. ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 26, 2024లో థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఆ తరువాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రాక్ పైకి వచ్చింది. సంజయ్ మాణిక్యం సంగీతాన్ని అందించాడు. కథలోకి వెళితే .. ఒకరాత్రి వేళ 'శకుంతల' అనే మహిళ, పోలీస్ స్టేషన్ కి కంగారుగా వస్తుంది. తన భర్త 'శేఖరన్' ఉదయం నుంచి కనిపించకుండా పోయాడనీ, ఏమైపోయాడోనని భయంగా ఉందని చెబుతుంది. తమ ఇల్లు తాకట్టులో ఉందనీ, కొంత కాలంగా వడ్డీ డబ్బు చెల్లించమంటూ 'త్యాగూ' తమని వేధిస్తున్నాడని పోలీస్ ఆఫీసర్ 'ఇలామారన్' కి ఫిర్యాదు చేస్తుంది. దాంతో త్యాగూపై అనుమానంతో ఇలమారన్ రంగంలోకి దిగుతాడు. అతని ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉండగానే, కొబ్బరి తోటలో ఒక యువతి హత్య జరుగుతుంది. ఆ కేసు మిస్టరీని ఛేదించడం కూడా ఇలమారన్ భుజాలపైనే పడుతుంది. ఆ యువతి హత్య కేసుకీ .. శేఖరన్ మిస్సింగ్ కేసుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ. ఆసక్తికరమైన కథాకథనాలు .. సహజత్వం ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పచ్చు.
Latest News