|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:22 PM
ఫాదర్స్ డే సందర్భంగా ప్రముఖ యాంకర్ లాస్య తన తండ్రికి ఓ మరపురాని కానుక ఇచ్చి వార్తల్లో నిలిచారు. తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను, ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, ఓ కారును బహూకరించి ఆయన్ను ఆనందంలో ముంచెత్తారు. ఈ విషయాన్ని లాస్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో, ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఫాదర్స్ డే సందర్భంగా యాంకర్ లాస్య తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారును బహుమతిగా అందించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కారు ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ సంతోషకరమైన వార్తను, కారుతో పాటు తన తల్లిదండ్రులు, భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు."నాన్నా, ఎంత కష్టపడ్డావో, ఎన్ని త్యాగాలు చేశావో నాకు బాగా తెలుసు. యు డిజర్వ్ దిస్ నాన్న. ఈ కారు నీకు చాలా హెల్ప్ అవుతుంది. మా నాన్నకి కారు కొని ఇవ్వడం ద్వారా నా కల నెరవేరింది. నీ హెల్త్ జాగ్రత్త నాన్నా. ప్రేమతో మీ చిన్న కూతురు" అంటూ లాస్య తన పోస్ట్‌లో ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు.అంతేకాకుండా, తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో లాస్య మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "చిన్నప్పటి నుంచి నాన్న కారులో తిరిగితే చూడాలనేది నా ఆశ. పెళ్లి తర్వాత నేను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నాను" అని ఆమె తెలిపారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనతో కొద్దికొద్దిగా డబ్బులు దాచుకుని, ఈ కారు కొన్నట్లు లాస్య వివరించారు.
Latest News