|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 07:50 PM
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది నటి సురేఖ వాణి. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి సురేఖ వాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నామె. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖ వాణి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఆమె వెండితెర మీద కనిపించి చాలాకాలం అయింది. సురేఖ వాణికి యాక్టింగ్ చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సురేఖ వాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య కూతురు సుప్రితతో కలిసి వైన్ తాగిన వీడియో కూడా ఆ మధ్య మీడియాలో వైరల్ అయింది. కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరికి సురేఖ వాణి బహిరంంగానే ముద్దులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణి, తన కూతురితో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందాల ఆరబోతలో కూతరితో పోటిపడుతోంది సురేఖ. కూతురికి ఏమాత్రం తీసిపోని విధంగా అందాలను ప్రదర్శించింది. ముఖ్యంగా ఎద అందాలను చూపించడంలో ఇద్దరూ కూడా గట్టిగానే పోటీ పడ్డారనిపిస్తోంది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.వయస్సు పెరిగే కొద్ది సురేఖ వాణి అందం పెరుగుతుందని కొందరు స్పందిస్తుంటే.. ఒకరిని మించి మరొకరు చూపిస్తున్నారంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Latest News