![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:55 PM
హైదరాబాద్ ఐ మాక్స్ థియేటర్ వద్ద కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు ఓ భిన్న రీతిలో ప్రాసలతో రివ్యూలు ఇస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ లక్ష్మణ్ టేకుముడి. అక్కడ వచ్చిన పేరుతో ఆపై సీరియల్స్ లలో అవకాశాలు దక్కించుకుని గత రెండేండ్లుగా సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా మారాడు.కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ భాషల చిత్రాలు, సిరీస్‌లు, చేతినిండా ప్రైవేట్ అడ్వర్టైజ్ మెంట్స్ చేసుకుంటూ యమ బిజీగా ఉన్నాడు. తాజాగా తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు.అయితే.. లక్ష్మణ్ ఇప్పుడు అంతకుమించిన సర్ఫ్రైజ్ తో షాకిచ్చాడు. ఆయ హీరోగా తాజాగా ది విండో అనే ఓ కొత్త థ్రిల్లర్ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నిత్య శ్రీ కథానాయికగా చేస్తోంది.గతంలో కొంచెం హట్ కే వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అవినాష్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పుడు ఈ వార్త, ఇందుకు సంబంధించిన షూటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి.
Latest News