![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:53 PM
కార్తీ హీరోగా నటించిన 'సర్దార్' సినిమా 2022లో దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రజిషా విజయన్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. లైలా ఓ కీలక పాత్రను పోషించి మెప్పించింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ తెలిపారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ను కొంతకాలం క్రితం ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టోటల్ క్రూ అంతా కలిసి కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.
Latest News