![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:53 AM
హిందీ చిత్రసీమలో అందాల సుందరి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రేఖది ప్రత్యేక స్థానం. ఆమెతో పోల్చదగ్గ నటీమణి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. చామనఛాయ కలిగిన నటీమణులు బాలీవుడ్ లో చాలామంది ఉన్నా... అందులో రేఖ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటారు. ఆమెలోని గ్రేస్ ను మరొకరిలో ఊహించలేం. అలానే రేఖ నటించిన సినిమాలలో 'ఉమ్రావ్ జాన్' కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1981 జనవరి 2న విడుదలైన ఈ సినిమాను ముజాఫర్ అలీ డైరెక్ట్ చేశారు. 1905లో వచ్చిన నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. లక్నోకు చెందిన వేశ్య నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫరూఖ్ షేక్, నసీరుద్దీన్ షా, రాజ్ బబ్బర్, షౌకత్ ఆజ్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రేఖకు 'ఉమ్రావ్ జాన్' మూవీ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అలానే ఉత్తమ సంగీత దర్శకుడిగా ముహమ్మద్ జహూర్ ఖయ్యం, ఉత్తమ నేపథ్య గాయనిగా ఆశా భోస్లే, జాతీయ ఉత్తమ కళా దర్శకుడిగా మంజూర్ అవార్డులు అందుకున్నారు. అలానే ఉత్తమ దర్శకుడిగా ముజఫర్ అలీ, సంగీత దర్శకుడు ముహ్మద్ జహూర్ ఖయ్యంతో కలిసి ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందారు.
Latest News