|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:53 PM
హైదరాబాద్ వేదికగా మహేష్ బాబు, రాజమౌళి సినీ గ్రాండ్ ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించబడింది. ఈ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. చిత్రబృందం తో పాటు సినీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు.వారణాసి సినిమాకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు నిర్మాత కేఎల్ నారాయణ చేశారు. “15 ఏళ్ల క్రితం మహేష్ బాబు, రాజమౌళి గారితో ఓ సినిమా చేయాలని యోచించాము. కానీ ఇంతకాలం పట్టుతుందని ఊహించలేదు. మహేష్ సూపర్‌స్టార్ కృష్ణ గారి లాగా ప్రొడ్యూసర్స్ హీరో. 15 ఏళ్ల క్రితం రాజమౌళి గారిని అడిగినపుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈగ, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. డైరెక్టర్ ఎన్ని ఎత్తులు అధిగమించినా, అప్పటి లాంటి సింప్లిసిటీ, కమిట్‌మెంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రియాంక చోప్రా గ్లోబల్ సీన్‌లో ఇండియన్ డైమెన్షన్స్ తీసుకువెళ్ళారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రాజమౌళి కథను అడగగానే ఒప్పుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి ఇప్పుడు ఆస్కార్ విజేత. వీరి తో పని చేయడం ఒక లార్జర్ దన్ లైఫ్ అనుభవం. ఈ సినిమా లేట్ అవ్వదు, చాలా త్వరగా రాబోతుంది,” అని కేఎల్ నారాయణ తెలిపారు.ఇక మరో నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ మాట్లాడుతూ, “చిన్న సినిమాలతో మొదలు పెట్టి నెమ్మదిగా ప్రొడ్యూసర్ అయ్యాను. పెద్ద హీరోతో పని చేయడం చాలా టైమ్ పడుతుందని అనుకున్నా, అదృష్టవశాత్తూ త్వరగా ఇది సాధ్యమైంది. లెజెండ్స్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ ఆడియన్స్ కి చేరవేయడానికి ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కేఎల్ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు,” అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హింట్ ప్రకారం, వారణాసి సినిమా 2027 వేసవిలో రిలీజ్ కానుంది.
Latest News