|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 02:49 PM
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ (55) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన.. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. హరీష్ రాయ్ దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలలో నటించారు. 'కేజీఎఫ్' చాప్టర్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో ఆయన తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Latest News