|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 03:18 PM
టాలీవుడ్ సినీ నిర్మాత అల్లు అరవింద్ 'సరైనోడు 2' సినిమాపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. అల్లు అర్జున్ హీరోగా 'సరైనోడు 2' వస్తే, అది కచ్చితంగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే వస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 'పుష్ప 3'పై కూడా అంచనాలు పెరిగాయి. రష్మిక ప్రధాన పాత్రలో అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.
Latest News