|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 10:20 AM
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో 'పరాశక్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ పీరియాడిక్ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'సింగారాల సీతాకోక' అనే మొదటి పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో శ్రీలీల అప్పటికాలపు చీరకట్టులో ఆకట్టుకుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రేవంత్, డీఈ ఆలపించారు. పూర్తి పాట నవంబర్ 6న విడుదల కానుంది.
Latest News