|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 11:02 PM
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన “వార్-2” డిజాస్టర్ టాక్‌తో ప్రేక్షకులను నిరాశపరిచింది.తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేసిన నాగవంశీ కూడా పెద్ద నష్టం ఎదుర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో, ఆ నష్టాన్ని ఆయన ఒప్పుకోగా, ఇది నిజమే అని వెల్లడించారు.అయితే, వార్-2 దెబ్బ కారణంగా, స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న “ఆల్ఫా” సినిమా ఇప్పుడు డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని నాగవంశీ ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాను ఆయననే రిలీజ్ చేయబోతున్నాడు.ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, సినిమా VFX పనులు ఇంకా పూర్తవలసి ఉన్నందున, మూవీ మేకర్స్ ఆరంభంలో ఏప్రిల్ 17కు రిలీజ్ చేసినప్పటికీ వాయిదా వేసారు.వార్-2 కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. స్పై యూనివర్స్ మీద ఇప్పటికే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ప్రేక్షకులు “ఒకే కథను ఎన్ని సార్లు తిప్పుతారు?” అని ఫైర్ అవుతున్నారు. అందుకే, నిర్మాణ సంస్థ కథలో కీలక మార్పులు చేసి, రీషూట్ చేసే విధంగా సినిమాను నాలుగు నెలల వాయిదా వేసినట్టు తెలిసింది.
Latest News