|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 10:36 AM
నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో, రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం విడుదలైన టీజర్, కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాలను హాస్యభరితంగా చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచింది. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది.
Latest News