|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:11 PM
RJ బాలాజీ దర్శకత్వంలో ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'కరుప్పు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగల్ మరియు టీజర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగిల్ ని త్వరలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమాని మేకర్స్ 2026 పొంగల్ కి విడుదల చేయాలనీ భావిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News