|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:04 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కింగ్' చిత్రం భారతీయ సినిమా యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ద చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది మరియు మేకర్స్ ఈ సినిమాని 2026లో విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, కిల్ ఫేమ్ రాఘవ్ జుయల్, జైదీప్ అహ్లావాట్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క టైటిల్ గ్లింప్సె ని నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు ట్రీట్ గా విడుదల చేయాలనీ భావిస్తున్నారు. షారుఖ్ చివరిసారిగా పెద్ద తెరపై కనిపించి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది, మరియు అతని అభిమానులు కింగ్‌లోని గ్రాండ్ యాక్షన్ దృశ్యం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ హై-బడ్జెట్ ఎంటర్టైనర్ ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, SRK యొక్క రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్ఫ్లిక్స్ బ్యానర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.
Latest News