|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 06:56 PM
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన కెరీర్‌లో మొదటిసారి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో జతకట్టడంతో 'స్పిరిట్' తెలుగు సినిమాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా మారింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యొక్క షూటింగ్ ని నవంబర్ లో ప్రారంభించటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మేకర్స్ ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ కొరియన్ నటుడు డాన్ లీ ని సెలెక్ట్ చేసినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ మరియు కాంచన ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు.
Latest News