|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 08:47 PM
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.తన తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు, ఈసారి చరణ్‌తో కలిసి ప్రేక్షకులకు భారీ మాస్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో, రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో చరణ్ కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో కొనసాగుతోందని సమాచారం. ఈ క్రమంలో విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లతో సినిమా చుట్టూ మంచి హైప్ ఏర్పడింది.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుచ్చిబాబు సన్నా డైరెక్టర్‌గా మారకముందు, సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడన్న విషయం చాలామందికి తెలిసిందే. ‘ఉప్పెన’ సినిమాతో తన సత్తా చాటుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు చరణ్‌తో చేస్తున్న ‘పెద్ది’ ప్రాజెక్ట్‌కు సుకుమార్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.ఇదే కాకుండా, సుక్కు ఈ ప్రాజెక్ట్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడటన్న టాక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం సుకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని, బుచ్చిబాబుతో కలిసి టెక్నికల్ అంశాలను ఫైన్ ట్యూన్ చేస్తున్నాడన్న సమాచారం వినిపిస్తోంది. కంటెంట్ మరియు టేకింగ్ విషయంలో సుకుమార్ స్టైల్‌కు ప్రత్యేకమైన క్వాలిటీ ఉండేలా చూసుకుంటున్నాడట.ఇక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏ.ఆర్. రెహమాన్ పనిచేస్తుండడం మరొక ప్రధాన ఆకర్షణ. చరణ్ – రెహమాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇది తొలి సినిమా కావడం విశేషం. ఇప్పటికే రెహమాన్ పలు మ్యూజిక్ ట్యూన్స్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిజైన్ పరంగా కూడా ‘పెద్ది’ అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతుండగా, సుకుమార్ వ్యక్తిగతంగా పనులు పర్యవేక్షిస్తున్నాడన్న వార్త సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతోంది.
Latest News