|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 05:40 PM
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' తో ప్రేక్షకులను అక్టోబర్ 31న అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంతో భాను బోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యంగ్ టాలెంట్ నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు హీరోలు కలిసి త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్నారని లేటెస్ట్ టాక్. రవితేజ మరియు నవీన్ పోలిశెట్టి కోసం ధమాకా రచయిత బెజవాడ ప్రసన్న ఒక స్క్రిప్ట్‌ను రాశారని మరియు ఇద్దరు నటీనటులకు కూడా స్క్రిప్ట్ నచ్చినట్లు సామాచారం. రవితేజ మరియు నవీన్ పోలిశెట్టి వారి నిష్కళంకమైన కామెడీ టైమింగ్‌కు పేరుగాంచారు. ఈ సహకారం జరిగితే, అది సినీ అభిమానులకు పండుగ అవుతుంది. మరి రానున్న రోజులలో ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
Latest News