|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 05:23 PM
ప్రముఖ కోలీవుడ్ నటులు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కొత్త చిత్రం కోసం జతకడుతున్నారు. దశాబ్దాల తర్వాత వారి ఆన్-స్క్రీన్ రీయూనియన్ గురించి అభిమానులు చాలా థ్రిల్‌గా ఉన్నారు. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌కి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించడం దాదాపుగా ధృవీకరించబడింది. ఇది రజనీకాంత్ యొక్క చివరి చిత్రం కావచ్చునని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన మరియు షాకింగ్ బజ్ చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, అతను ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని యోచిస్తున్నాడు అని టాక్. ఇది తలైవర్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ చిత్రం 2027లో సెట్స్‌పైకి వెళ్తుందని అంతకు ముందు, జైలర్ 2 పూర్తి చేసిన తర్వాత, రజనీ సుందర్ సితో కలిసి పనిచేయవచ్చని కూడా నివేదించబడింది. కొనసాగుతున్న బజ్ ప్రకారం, నవంబర్ 7, 2025న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ మెగా మల్టీస్టారర్‌ని నిర్మిస్తుంది.
Latest News