|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 02:44 PM
తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా, తమిళ అగ్రనటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున చెన్నై డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు అందాయి. వారితో పాటు, కీల్పాక్కంలో ఉన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇళ్లకు కూడా బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు.
Latest News