|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:12 PM
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన హారర్-కామెడీ చిత్రం 'థమ్మ' బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబడుతోంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా, ఆరు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 91.70 కోట్లు వసూలు చేసి, 100 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఆదివారం (ఆరో రోజు) ఈ సినిమా సుమారు రూ. 13 కోట్లు రాబట్టింది. శనివారం నాటి రూ. 13.10 కోట్ల వసూళ్లతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువ. దీపావళి మరుసటి రోజు రూ. 24 కోట్లతో భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం, ఆ తర్వాత రోజుల్లో కొంత నెమ్మదించింది. బుధవారం రూ. 18.60 కోట్లు, గురువారం (భాయ్ దూజ్) రూ. 13 కోట్లు, శుక్రవారం రూ. 10 కోట్లు వసూలు చేసింది. అయితే, వారాంతంలో మళ్లీ పుంజుకున్నా, తొలిరోజు వసూళ్లను మాత్రం దాటలేకపోయింది. ఈ వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిటిక్స్ సంస్థ సాక్‌నిల్క్ వెల్లడించింది.
Latest News