|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 08:27 PM
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న నటులులలో ఒక్కరు. నటుడి లైన్ అప్ లో భారీ స్థాయి ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. వాటిలో సందీప్ రెడ్డి వంగాతో తన అత్యంత ఎదురుచూసిన చిత్రం స్పిరిట్. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ మరియు కాంచన ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవి తేజ కొడుకు మహాధన్ భూపతిరాజు అస్సిస్స్టాంట్ డైరెక్టర్ గా చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని టి-సిరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు.
Latest News