|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 03:38 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొని తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రతిక రోజ్ కు హీరోయిన్ గా అవకాశం లభించింది. సీవీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎక్స్ వై' అనే చిత్రంలో ఆమె నటించనుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ విడుదల కానుంది. గతంలో నారప్ప, దృశ్యం 2 వంటి చిత్రాలలో నటించిన ఆమె హీరోయిన్ కావాలనే తన కల ఈ సినిమాతో నెరవేరనుంది. ఇక హీరోయిన్ గా ఆమె ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.
Latest News