|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 08:15 PM
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'కిష్కీందపురి' చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ గా విడుదల అయ్యింది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5లో ప్రసారానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఒక ప్రధాన మైలురాయిని దాటింది. ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలని క్లాక్ చేసినట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ సినిమాలో సుదర్శన్, ఆది, శాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, ప్రేమ, శ్రీకాంత్, మర్ఖండ్ దేశ్ పండేయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.
Latest News