|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 07:21 PM
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సేకరించిన ఏనుగు దంతాలను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, అలాగే మోహన్ లాల్‌కు జారీ చేసిన లైసెన్సును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2015లో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో లోపాలున్నాయని, దానిని అధికారిక గెజిట్‌లో ప్రచురించనందున చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. 2011లో మోహన్ లాల్ ఇంట్లో దొరికిన ఏనుగు దంతాలు, ఐవరీ వస్తువులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది.
Latest News