|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:26 PM
భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతితో యాడ్స్ ప్రపంచంలో విషాదం నెలకొంది.ఫెవికాల్ యాడ్స్‌లో కనిపించే హాస్యం నుంచి క్యాడ్‌బరీ 'కుచ్ ఖాస్ హై'లోని మాధుర్యం వరకు, ఏషియన్ పెయింట్స్ 'హర్ ఖుషీ మే రంగ్ లాయే' నుంచి వొడాఫోన్ పగ్ యాడ్ వరకు ఆయన సృష్టించిన ప్రతి ప్రకటన భారతీయ జనజీవనంలో భాగమైపోయింది. సామాన్యుడి భావోద్వేగాలను పట్టుకుని, వాటిని అద్భుతమైన కథలుగా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి.వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా, రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ఆయన రూపొందించిన 'అబ్ కీ బార్, మోదీ సర్కార్' నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Latest News