|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:23 PM
ప్లాస్టిక్ సర్జరీ పుకార్లపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా, తాను 'బఫెలో ప్లాస్టీ' చేయించుకున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను చూసి యువతులు మోసపోవద్దని ఆమె హితవు పలికారు.తాజాగా ఆమె మాట్లాడుతూ.... "కొంతమంది డాక్టర్లుగా నటిస్తూ, నా ఫొటోను ఉపయోగించి నేను 'బఫెలో ప్లాస్టీ' చేయించుకున్నట్లు వీడియోలు చేస్తున్నారు. అది చూసి నేను షాకయ్యాను" అని ఆమె అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం అత్యంత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా యువతులకు జాన్వీ కీలక సూచనలు చేశారు. "సోషల్ మీడియాలో కనిపించే ప్రతీదాన్ని గుడ్డిగా అనుకరించకూడదు. ఈ తప్పుడు సమాచారం విని ఎవరైనా దానికి ప్రయత్నించి, రిస్క్ లో పడితే అది చాలా ఆందోళనకరం అవుతుంది. యువతులు తమ శరీరాన్ని ప్రేమించాలి. మనల్ని మనం అంగీకరించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు" అని ఆమె సూచించారు.
Latest News