|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 10:36 AM
గ్లోబల్ సెన్సేషన్ ఎస్ఎస్ రాజమౌలి యొక్క బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి మరియు తమన్నా భాటియా ప్రధాన పాత్రలలో నటించారు. ఫిల్మ్ ఫ్రాంచైజీలోని రెండు భాగాలు-బాహుబలి: ది బిగినింగ్ అండ్ బాహుబలి: ది కన్‌క్లూజన్ రెండు భాగాలు ఒకే సినిమా 'బాహుబలి: ది ఎపిక్' అనే టైటిల్ తో అక్టోబర్ 31, 2025న స్పెషల్ చిత్రం పెద్ద స్క్రీన్ పై విడుదల కానుంది. ఈ సినిమా అన్ని ప్రీమియమ్ లార్జ్ ఫార్మాట్స్ లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్ర విడుదల ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళాలలో విడుదల కానుంది. ఈ సినిమాలో అడివి శేష్, నాసర్, సుబ్బరాజు, సత్య రాజ్ కీలక పాత్రలలో నటించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ క్రింద షోబు యార్లాగద్ద మరియు ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రంలో MM కీరావాని స్వరపరిచిన చార్ట్‌బస్టర్ సౌండ్‌ట్రాక్ ఉంది.
Latest News