|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 11:53 PM
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చాడు. సీనియర్ హీరో వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నారనే ప్రచారం చాలాకాలంగా ఉంది.ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో రూమర్లకు పూర్తిగా చెక్ పడింది. సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి రెగ్యులర్‌గా స్టార్ట్ అవుతుంది అని సమాచారం.త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా ప్లాన్ చేసినా, బన్నీ త్రివిక్రమ్ ను పక్కన పెట్టి అట్లీతో భారీ ప్రాజెక్ట్‌లో బిజీ అయ్యారు.దీని ఫలితంగా త్రివిక్రమ్ ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా ప్రారంభించారు. ఇకపై, జూనియర్ ఎన్టీఆర్ తో మైథాలజికల్ ప్రాజెక్ట్ కూడా త్రివిక్రమ్ చేతిలో ఉంది, కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నందున, ఆ తర్వాత మాత్రమే త్రివిక్రమ్‌తో తదుపరి ప్రాజెక్ట్ జరిగే అవకాశం ఉంది.
Latest News