|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:58 PM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' ఆగస్టు 14, 2025న గ్రాండ్ గా విడుదల అయ్యింది. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్, వార్ యొక్క సీక్వెల్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. ఈ ఎంటర్టైనర్ తెలుగు, హిందీ మరియు తమిళ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం ఆంగ్ల ఉపశీర్షికలతో పాటు అందుబాటులో ఉంది. ఈ సినిమా ఓటీటీలో అనూహ్య స్పందనను అందుకుంటుంది. వరుసగా రెండవ వారం భారతదేశంలో OTTలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా డిజిటల్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. ఓర్మాక్స్ రిపోర్ట్స్ ప్రకారం, వార్ 2 యొక్క వీక్షకుల సంఖ్య అక్టోబర్ 13 మరియు 19 మధ్య బాగా పెరిగింది. అంతకు ముందు వారం 3.5 మిలియన్లతో పోలిస్తే 5.3 మిలియన్ల వీక్షణలు నమోదయ్యాయి. కియారా అద్వానీ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్ అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అశుతోష్ రానా మరియు అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News