|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:52 PM
మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో 'థామా' చిత్రం అక్టోబర్ 21, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖుర్రానా మరియు రష్మికా మాండన్న ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని నైరెన్ భట్, అరుణ్ ఫ్యులారేరా మరియు సురేష్ మాథ్యూ రాశారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
Latest News