|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 07:47 AM
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన 'కాక్టెయిల్' కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఇటీవలే ప్రకటించబడింది. ఈ సీక్వెల్ లో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్ రష్మిక మాండన్నా మరియు కృతి సనన్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే కృతి సనన్ 'తేరే ఇష్క్ మెయిన్' షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు నటి ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని కాక్ టైల్ 2 లో జాయిన్ కావటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ లో నటి ఆగష్టులో జాయిన్ కానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ రంజన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, హోమి ఆడజానియా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News