|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 04:01 PM
టాలీవుడ్ అగ్ర నటి కాజల్ ఆగర్వాల్ తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.పెళ్లై అబ్బాయి పుట్టాక సినిమాలకు దాదాపు దూరం అయిన కాజల్ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది.కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు, ఫాలోవర్స్‌కు టచ్‌లోనే ఉంటుంది. తరుచూ ఫొటోషూట్లు, ఈవెంట్లు, ప్రైవేట్ కార్యక్రమాల్లో దర్శణమిస్తోంది.తాజాగా భర్త కిచ్లూ, కుమారుడితో కలిసి మాల్దీవ్ ట్రిప్కు వెళ్లిన కాజల్ ఆగర్వాల్ అక్కడ సముద్ర తీరంలో ఆటలాడుతూ, సేద తీరుతూ, బికినీలో హంగామా చేసింది.తన సొదరి నిషాతో కలిసి జలకలాడుతూ ఒకరికొకరు ఎంజాయ్ చేశారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఒక్క సారిగా వైరల్ అయి ఇంటర్నెట్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి. ఇదిలాఉంటే చివరగా తెలుగులో సత్యభామ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగమ్మ త్వరలో విడుదల కానున్న కన్నప్పలో పార్వతీ దేవిగా కనిపించనుంది.
Latest News