|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:27 PM
విక్రమ్ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత కమల్‌హాసన్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ థగ్ లైఫ్. నాయకుడు వంటి కల్ట్ క్లాసిక్ చిత్రం అనంతరం 38 యేండ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించడంతో ఈ సినిమాకు ప్రత్యేకత ఏర్పడింది. అయితే గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను అలరించగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో మణిరత్నం ప్రేక్షకులకు మంచి చిత్రం అందించలేక పోయినందుకు క్షమాపణలు సైతం చెప్పారు. ఇదిలాఉంటే సినిమా ఫలితం ఎలా ఉన్న ఈ మూవీలోని జింగ్‌చా అనే పాట చాలామందికి చేరువయింది. అనేకమంది సినిమాపై అనేక విమర్శలు చేసినా ఈ పాటపై మాత్రం మంచి రివ్యూస్ ఇచ్చారు. అలాంటి ఈ పూర్తి తెలుగు వీడియో సాంగ్‌ను మేకర్స్ మంగళ వారం రిలీజ్ చేశారు. పాట అలా రిలీజ్ అయిందో లేదో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. క్షణాల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా మంగ్లీ తో కలిసి శ్రీకృష్ణ, అషిమా మహజన్, వైశాలి సమంత్ ఆలపించారు.
Latest News