|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:58 PM
టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ముంబైలో అడుగుపెట్టినట్లు తెలుపుతూ, ఈ సినిమాకు సంబంధించిన తన మనోభావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'కన్నప్ప' చిత్రం విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉందని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఈ శుక్రవారం జూన్ 27న కన్నప్ప మీ ముందుకు వస్తోంది. పరమశివుడి గొప్ప భక్తుడి కథను ప్రపంచం వీక్షించనుంది" అని ఆయన తెలిపారు. సినిమాపై తనకున్న మమకారాన్ని వివరిస్తూ "నా హృదయం, నా ఆత్మ - నా బేబీ - చివరికి ప్రపంచాన్ని కలవబోతోంది" అంటూ ఉద్విగ్నభరితమైన వ్యాఖ్యలు చేశారు.గత కొంతకాలంగా మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాను అత్యంత శ్రద్ధతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా శివుని పరమభక్తుడైన కన్నప్ప కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో విష్ణు తన సంతోషాన్ని ఈ విధంగా అభిమానులతో పంచుకున్నారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News