![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:56 PM
మలయాళంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమానే 'అలప్పుజ జింఖానా'. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అదే నెలలో 25వ తేదీన తెలుగు ప్రేక్షకులను పలకరించింది. విష్ణు విజయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా,ఈ నెల 20వ తేదీ నుంచి 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: జోజో జాన్సన్ ( నస్లేన్) షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్) షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్)దీపక్ (గణపతి) డీజే (బేబీ జీన్) షణవాస్ (శివ హరిచరణ్) .. వీళ్లంతా కూడా 'అలప్పుజ'కి చెందిన కుర్రాళ్లు. అందరూ కూడా ఇంటర్ చదువుతూ ఉంటారు. చదువు పట్ల దృష్టి తక్కువ .. ఆకతాయి పనుల పట్ల ఆసక్తి ఎక్కువ అన్నట్టుగా వాళ్ల లైఫ్ సాగిపోతూ ఉంటుంది. అందువలన ఒక్క షణవాస్ మినహా మిగతా వాళ్లంతా ఫెయిల్ అవుతారు. అదే టౌన్ లో చదువుతున్న అనుపమ .. షెర్లిన్ .. నటాషా అనే ముగ్గురు అమ్మాయిలను లైన్లో పెట్టాలనే ప్రయత్నంలో జోజో ఉంటాడు. ఒకానొక సందర్భంలో .. ఒక గొడవ విషయంలో జోజో బ్యాచ్ కి అమ్మాయిల ముందు అవమానం జరుగుతుంది. దాంతో తామంతా బాక్సింగ్ నేర్చుకుంటే బాగుంటుందని జోజో భావిస్తాడు. స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ సీట్లు సంపాదించవచ్చని అందరినీ ఒప్పించి, వాళ్లతో పాటు 'అలప్పుజ జింఖానా' అనే అకాడమీలో చేరతాడు. అయితే అప్పటివరకూ తినితిరగడం అలవాటైన కారణంగా, బాక్సర్ కావడానికి అవసరమైన కసరత్తు చేయలేకపోతారు. అలాంటి సమయంలోనే వాళ్లకి ఆంటోని (లక్మన్ అవరన్) కోచ్ గా వస్తాడు. రాష్ట్రస్థాయి పోటీల వరకూ జోజో బ్యాచ్ ను తీసుకుని వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? తమ జిల్లాకు పేరు తీసుకురావాలన్న ఆ బ్యాచ్ కోరిక నెరవేరుతుందా? జోజోతో జోడి కట్టేది ఎవరు? అనేది మిగతా కథ.
Latest News