|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 03:37 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. 'వర్షం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఆమె మొదటి ప్రాజెక్ట్‌తోనూ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ హీరోలతో నటించి మెప్పించింది. 42 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. కుర్ర హీరోలను గట్టి పోటీనిస్తోంది. ఏమాంత్రం అందం చెక్కచెదరకుండా గ్లామర్‌ను మెయిన్‌టేన్ చేస్తోంది. ప్రస్తుతం త్రిష 'విశ్వంభర'మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష టాలీవుడ్ స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ''మహేష్ బాబు చెన్నైలో కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు, మాకు ఉమ్మడి స్నేహితులు ఉండేవారు. అలాగే మేము మొదట కలిశాము. అప్పుడు అది 'హాయ్-బై' రకమైన స్నేహం మాత్రమే. మేము కలిసి సినిమాల్లో పని చేస్తామని మాలో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత షూటింగ్ సెట్‌లో కలిసి పని చేసినప్పుడు వృత్తిపరమైన సంబంధంగా మారింది. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన కేడా ఒకరు. తోటి నటీనటులను ఎంతో గౌరవిస్తారు. ఇండస్ట్రీలో చాలామందికి అది చేతకాదు. మహేష్ బాబు చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపించేది. కానీ ఆయన మాత్రం వేకువజామున సెట్‌కు వచ్చి రాత్రి 10:30 గంటలవరకు అక్కడే ఉండేవారు. అలా ఆయనతో వర్క్ చేసినప్పుడు గిల్టీగా ఫిలయ్యాను. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా మానిటర్ దగ్గరే కూర్చునేవారు'' అని చెప్పుకొచ్చింది. కాగా.. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో జంటగా నటించి మెప్పించారు.
Latest News