|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 10:55 AM
యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'తాండాల్' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఇది నటుడి మొట్టమొదటి 100 కోట్ల చిత్రం. ఈ రొమాంటిక్ డ్రామా వరల్డ్ వైడ్ గా 115 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ చిత్ర విజయం నాగ చైతన్య మార్కెట్ విలువను పెంచింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 29న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రం 2018లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృధివి, దివ్య పిళై, మహేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
Latest News