|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 02:41 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన "కుబేర" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్‌తో పాటు కింగ్ నాగార్జున నటన గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. "కుబేర"లో నాగార్జున దీపక్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పాత్ర టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ లీగ్ హీరోలలో ఒకరైన నాగార్జున, ఇలాంటి ఒక సినిమాలో పాత్రను ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటి నిర్ణయం తీసుకోవడమే ఈ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్. అంతేకాదు, తన రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటపడి, డీ-గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ విమర్శకుల నుంచి కూడా నాగార్జున నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల లాంటి సున్నితమైన దర్శకుడు క్రైమ్ డ్రామాతో ముందుకు వస్తే, ఆయనను ప్రోత్సహించడమే కాకుండా, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలను కూడా నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు. ఒక రకంగా, ఆయన మళ్ళీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో ధనుష్‌తో పోలిస్తే నాగార్జున్ తెర మీద కనిపించే నిడివి కాస్తా తక్కువగా అనిపించింది. దీనిపై కింగ్ అభిమానులు కాస్తా నిరాశ చెందారు.నాగ్ అసలు ఈ క్యారెక్టర్‌ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా దీనిపై నాగార్జున సక్సెస్ మీట్‌లో వివరణ ఇచ్చారు. సినిమా కథ చెప్పినప్పుడు నాదే మెయిన్ రోల్ అనుకున్నా అని, అయితే నేను కనిపించే టైమ్ తక్కువగా ఉందని అభిమానులు ఫీల్ అవుతున్నారని నాగార్జున తెలిపారు. అయితే నా పాత్ర చూట్టునే కథ మొత్తం తిరుగుతుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, నేను యాక్టర్‌నని నచ్చిన పాత్రలు చేసుకుంటూ పోవడమే అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక "కుబేర" సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹12.4 కోట్ల నుండి ₹13.5 కోట్ల (నెట్) మధ్య వసూలు చేసినట్లు అంచనా. నాగార్జున్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా కుబేరా నిలిచింది.
Latest News