|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:29 PM
స్టార్ హీరో ధనుష్, నాగార్జున, రష్మిక, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన 'కుబేర' సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తాంది. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో కలిపి తొలిరోజు ఏకంగా రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై బజ్ పెరగడంతో వీకెండ్లో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్‌కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం. అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటివరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News