|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 09:21 AM
తమిళ స్టార్ హీరో ధనుష్ తాను నటించిన 'కుబేర' మూవీని థియేటర్లో చూసి భావోద్వేగానికి గురయ్యారు. అక్కినేని నాగార్జునతో కలిసి ధనుష్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.తొలిసారిగా ధనుష్ ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్ర పోషించారు. తాజాగా ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్‌లో తన కుమారుడితో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. వెండితెరపై తన పాత్రను చూసుకుని ధనుష్ భావోద్వేగానికి గురయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసి ఎమోషన్ అయినట్లు కనిపిస్తున్నారు.ధనుష్ ఇదివరకే అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, ఇప్పుడు ఓ బిచ్చగాడి పాత్రలోనూ నటించి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రంపై మంచి రివ్యూలు వస్తుండటంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ చిత్రంలో ధనుష్, నాగార్జునలలో ఎవరు హీరో అనేది చెప్పలేని విధంగా ఉందని అభిమానులు అంటున్నారు. సినిమా కథే విశేషంగా ఆకట్టుకుంటోందని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది
Latest News