|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 06:56 PM
పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సాలార్' సూపర్ హిట్ గా నిలిచింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ సీక్వెల్ "సాలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం". ఈ చిత్రం ఇంకా నిర్మాణంలో ఉండగానే ఉత్కంఠభరితమైన టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ యొక్క లీక్ ఫుటేజ్ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. పూర్తి విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని అక్టోబర్ లో ప్రారంభించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ద ర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, గోపి, ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రీయ రెడ్డి, బ్రహ్మాజీ, బాబీ సింహ, టిన్ను ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
Latest News